![]() |
భారత్ ఫ్రెండ్స్
ఇంటర్మీడియట్‌లో 970 కు పైగా మార్కులు వచ్చి ఉండాలి.
తల్లిదండ్రుల మాట తప్పని సరిగా వినాలి.
మీరు చదువుకుంటున్న కాలము మరియు లోన్ పూర్తిగా తిరిగి చెల్లించే వరకు ప్రతినెల ఒక ఉత్తరం తప్పనిసరిగా భారత్ ఫ్రెండ్స్‌కి రాయాలి.
సంవత్సరానికి ఒకసారి భారత్ ఫ్రెండ్స్ వారు నిర్వహించే మీటింగ్‌కి మీ తల్లిదండ్రులతో సహా తప్పనిసరిగా హాజరు కావాలి.
మీ కళాశాలకు భారత్ ఫ్రెండ్స్ ద్వారా వచ్చే జూనియర్స్‌ని మీ స్నేహితుల వలె రిసీవ్ చేసుకోవాలి.
మీరు మీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుని బాగా చదువుకోవాలి.
మీరు ఉద్యోగము వచ్చిన తరువాత తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి.
బ్యాంక్‌లో లోను తీసుకున్న వారు ప్రతినెలా బ్యాంక్‌లో వడ్డీ తప్పని సరిగా కట్టాలి.
భారత్ ఫ్రెండ్స్‌లో వడ్డి లేనీ లోను తీసుకున్న వారు ప్రతినెలా తప్పని సరిగా ఆ నెల వాయిదా చెల్లించాలి.
మీరు కళాశాలలో ర్యాగింగ్‌లో పాల్గొనరాదు, ర్యాగింగ్ చేసేవారికి సహకరించరాదు.
ఒకసారి భారత్ ఫ్రెండ్స్ ద్వారా లోను తీసుకున్న తరువాత మరే ఇతర బ్యాంకులలో లోను కొరకు సంప్రదించరాదు.
మీకు Email ID తప్పనిసరిగా ఉండాలి. Email చూసుకోవాలి సమాధానాలు వ్రాయాలి.
మీరు ప్రతి సం|| హాల్ టికెట్, మార్క్‌లిస్ట్ & హాజరు వివరాలు (Duplicate) భారత్ ఫ్రెండ్స్ లో నమోదు చేయాలి.
మీరు గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థల నుండి ఏదైనా స్కాలర్‌షిప్ పొందిన యెడల ఆ విషయం లోనుకు అప్లై చేసేటప్పుడు భారత్ ఫ్రెండ్స్‌కు తెలియచేయవలెను. లోను పొందిన తరువాత నైనా కూడా ఇలాంటి స్కాలర్‌షిప్ పొందినచో వెంటనే తెలియజేయవలెను. తిరిగి కట్టనవసరంలేని స్కాలర్‌షిప్ లేదా ధన సహాయం పొందినప్పుడు, ఆ డబ్బును లోను రీపేమెంట్‌కై వినియోగించవలెను.
ఏదైనా బ్యాంకులో ఎడ్యుకేషన్ లోను తీసుకుని ఉన్నచో, భారత్ ఫ్రెండ్స్ ద్వారా లోను కోసం ప్రయత్నించరాదు. ఏ సంవత్సరంలోనూ సబ్జెక్ట్స్ పోకూడదు, సంవత్సరం చివరకు మార్కులు 70% కు పైన ఉండాలి. అటెండెన్స్ 95% కు పైన ఉండాలి.
|